సేంద్రియ పద్దతులలో వ్యవసాయం చేస్తున్న ఆధునిక రైతు


ఆయన ఒక ఇంజినీర్. ఐతేనేం వ్యవసాయంలో ఆధునిక ఒరవడికి శ్రీకారం చుట్టారు. సేంద్రియ బాట పట్టి, అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఆ ఇంట అందరూ ఆయన వెంటే. పూర్తి రసాయనాలతో కూడా సాధ్యం కాని దిగుబడులు ఆయన సొంతం. వరిలో కేవలం ఆవుపేడ, మూత్రం తో 35 బస్తాల నాణ్యమైన దిగుబడి సాదిస్థునారు. కోలమాన్ పెట్ లో వున్నా ఆయన 95 ఎకరాల వ్యవసాయ క్షేత్రం నిత్యం సందర్సకులతో కిటకిట లాడు తుంటుంది. ప్రకృతి  ప్రేమికులు,ఆరోగ్య అభిలాషులు ఆయన పండించిన ధాన్యం కై ఎగబడటం, ఆయన సేద్య విధానానికి నిజ రుజువు. రసాయనాలతో విసిగి వేసారిన రైతాంగానికి, కనువిప్పు లా ఆయన సేద్యం మార్గ దర్శ కంగా  వున్నది. ప్రతి రైతు సందర్శించ దగ్గ క్షెత్రమ్.